Tuesday 16 November 2010

చెప్పాలనుకున్నది....చెప్పేయ్ !!

మనలో చాలా మందికి అందరిలో కాని, ఎవరితోనైనా కాని మాట్లాడాలంటే ఎందుకో తెలియదు కాని అదోరకమైన భయం. మనం అనుకున్నది చెప్పలేక పోతాము. ఎదుటివాళ్ళు ఏమైనా అనుకుంటారేమో లేదా మనం చెప్పింది నచ్చక పొతే మనతోమాట్లాడటం మానేస్తారేమో....ఇలా ఎన్నో అనుమానాలతో భావ వ్యక్తీకరణ సరిగా చేయలేకపోతాము.
చెప్పాలనుకున్నది ఖచ్చితంగా..అనుకున్నది అనుకున్నట్లు ఎదుటివారిని నొప్పించకుండా చెప్పడం కుడా ఓ కళ. కొద్దిమందికి మాత్రమే ఈ కళని వరంగా దేవుడు ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఇక ఈ వరం లేని వారి సంగతి? ఏం చేద్దాం చెప్పండి మెల్లగా ఈ కళని అలవరుచుకోవడానికి ప్రయత్నించడమే. కొద్దిగానైనా తప్పకుండా వస్తుంది మన ప్రయత్నలోపం లేకుండా వుంటే. నీకు మంచి అనిపించింది మంచిమాటలలో చెప్పు. చెప్పాలనుకున్నది ఎదుటివారికి అర్ధమైయ్యేటట్లు చెప్పడం మన వంతు. నచ్చడం నచ్చక పోవడం వాళ్ళ ఇష్టం. ఏమనుకుంటారో అని చెప్పాలా వద్దా అని ఊగిసలాడితే ఎవరో మహానుభావులు అన్నట్లు ఓ జీవితకాలం లేటు అవ్వచ్చు. అందుకే ధైర్యం గా ఆలస్యం చేయకుండా మనసులో అనుకున్నది నిర్భయంగా , సూటిగా చెప్తే చాలా వరకు అనుమానాలు, అపార్ధాలు లేకుడా పోతాయి.

Sunday 14 November 2010

తప్పొప్పులు

మనం చేసే తప్పులకు ఎదుటి వారిని బలి చేయకుండా, చేసిన తప్పుని ఒప్పుకునే మంచితనముంటే దానికి మించిన సంపద మరేది లేదు.

Thursday 11 November 2010

చిన్న మాట

మనం చేసే ప్రతి పని ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా వుంటే అంత కన్నా మంచి పని ఇంకోటి లేదు.

Wednesday 23 June 2010

చిన్న చిట్కా

ఏదైనా వేరే ఊరు కాని, కొత్త ప్రదేశానికి కాని వెళ్ళేటప్పుడు అక్కడి నీళ్ళు తేడా చేయకుండా ఉండటానికి (జలుబు లాంటివి తొందర గా రాకుండా ఉండటానికి) వెళ్ళే ముందు కుంకుడు కాయంత చిన్న పసుపు ముద్ద మింగి వెళితే జలుబు, జ్వరం లాంటివి మీ దరి చేరవు.

Friday 18 June 2010

పెద్దలు చెప్పిన మాటలు....

మన ప్రవర్తన నలుగురికి ఆదర్శ ప్రాయంగా ఉండాలి కాని పదిమంది అసహ్యించుకునేలా ఉండకూడదు...

Wednesday 9 June 2010

వినదగు మాటలు

తన వైఫల్యాలకు పరిస్థితులను నిందించకుండా వాటిని తనకనుకూలంగా మలుచుకోగలిగినవాడే విజయం సాదించగలుగుతాడు.
బెర్నాడ్ షా

Thursday 3 June 2010

నాకు నచ్చిన మాటలు

ప్రతి అపజయము కావాలి సాధించబోయే లక్ష్య సాధనకు వారధి...
పడి లేచే కడలి కెరటం కావాలి ఆదర్శం.....

మనం చేసే పని మంచిపని అని నమ్మకమున్నప్పుడు ముందుకు సాగిపోవడమే...
అనుకున్నది సాధించడమే మన ధ్యేయం కావాలి....అప్పుడే విజయం మన సొంతమౌతుంది....







Tuesday 1 June 2010

చిన్న సలహా....

మిమ్మల్ని నమ్మిన వాళ్ళను మోసం చేసి అందలాలు ఎక్కాలనుకోకండి...
అది ఆత్మ ద్రోహం అవుతుంది. మీకు ఆత్మే లేదంటారా!! ఐతే సరే....

Wednesday 12 May 2010

వ్యక్తిత్వం

నీ వ్యక్తిత్వాన్నిఎవరికీ తాకట్టు పెట్టకు, ఒకసారి వ్యక్తిత్వాన్ని కోల్పోయావంటే ఇక జన్మలో తిరిగి సంపాదిన్చుకోలేవు...

Wednesday 5 May 2010

ఇష్టము

ఒక మనిషిని మనం ఇష్టపడ్డాము అంటే ఆ వ్యక్తిలోని మంచి చెడు రెండు ఇష్టపడినట్లే....

Monday 3 May 2010

మాట ముత్యమైన వేళ....

మాట్లాడటం కుడా ఒక కళే.....ఎదుటివారిని నొప్పించకుండా మాట్లాడే వారిని ఇష్టపడని వారు వుండరు. ఏదోఒకటి మాట్లాడటం కాకుండా ఎదుటి వారికి సంతోషాన్నిచ్చేటట్లు.....మాటలు ముత్యాల మూటలు.... అన్నట్లు వుంటే మిమ్మల్ని ఇష్టపడనివారు ఉండరంటే నమ్మండి!!

Wednesday 28 April 2010

చిన్న చిట్కా

గాస్ట్రిక్ ట్రబుల్ వున్న వారు ఒక చిన్న గ్లాసు కాచి చల్లార్చిన ప్రిజ్ లో పెట్టిన పాలు తాగితే తొందరగా తగ్గి పోతుంది.

Thursday 22 April 2010

మానవత్వం

ఒకరి సాయాన్ని తీసుకుని అది మర్చిపోతే మానవత్వం అనిపించుకోదు...

Tuesday 20 April 2010

సాయం

మనకు చాతనైతే ఎదుటి వారికి సాయం చేయాలి లేదా దూరం గా వుండాలి అంతే కాని తెలిసి హాని చేయకూడదు.

Sunday 18 April 2010

విజయపధం

ప్రతి మనిషి జీవితంలో ఏదోఒక పని చేయగలడు కాని అన్ని పనులు ఒక్కడు మాత్రమే చేయలేడు ....కాబట్టి మనలోని జిజ్ఞాసను గుర్తించి మనం చేయగల పనిలో ముందుకు వెళ్ళగలిగితే విజయం మనకు సొంతమవుతుంది తప్పకుండా....

Monday 12 April 2010

జీవితం

సమస్య జీవితకాలం మన జీవితకాలం తో పోల్చుకుంటే చాలా చిన్నది...అందుకే సమస్యను చూసి భయపడకండి, ధైర్యంగా ఎదుర్కోండి..ఈ రోజు వున్న సమస్య రేపు వుండదు అలాంటి దాని కోసం మనం భయపడటం అవసరమా!! ఎంతో విలువైన జీవితాన్ని పాడు చేసుకోకుండా పడిలేచే కడలి తరంగాన్ని ఆదర్శంగా తీసుకోండి. తప్పకుండా విజయం మీ సొంతమవుతుంది. గెలుపు రుచి తెలుస్తుంది.

అవకాశం...

శత్రువులని స్నేహితులుగా మార్చుకోడాని ప్రయత్నించాలి కాని ఒక్క స్నేహితుని కుడా శత్రువు గా మారే అవకాశాన్ని కల్పించ వద్దు.

Thursday 8 April 2010

తప్పొప్పులు

మనం ఎదుటి వాళ్ళకు ఒక వేలు చూపిస్తే మనవేపు నాలుగు వేళ్ళు చూస్తూ వుంటాయి...ముందు ఎదుటి వాళ్ళలో తప్పులు వెదకడం మానేసి మనలోని తప్పులను, లోపాలను గుర్తించి వాటిని మార్చుకుంటే అప్పుడు ఎదుటి వాళ్ళలో మంచి కనిపిస్తుంది...నా దృష్టిలో తప్పులు చేయని వారు వుండరు కాని తప్పును ఒప్పుకుని దాన్ని సరిదిద్దుకునే వాళ్ళు ఎంతో ఉన్నతులు....

Wednesday 7 April 2010

చిట్కా

వేసవి లో పసిపిల్లలకు వడదెబ్బ తగలకుండా వుండాలంటే ఎండు ఖర్జూరాలు ఒకటి లేదా రెండు రాత్రి పూట కొద్దిగా నీళ్ళలో నానబెట్టి మరుసటి రోజు మధ్యానం ఆ నీళ్ళు పిల్లలకు పడితే వడదెబ్బ తగలకుండా వుంటుంది...

Tuesday 6 April 2010

మరో చిన్న సలహా

స్నేహితులని తిట్టేటప్పుడు పక్కన ఎవరు లేకుండా చూసుకోండి...పొగిడేటప్పుడు మాత్రం అందరి మద్యలో పొగడండి...ఇది నాకు నా నేస్తం ఇచ్చిన సలహా....నిజమే కదా!!

Monday 5 April 2010

కోపానికి.... రెండో సలహా....

ఎవరి మీదైనా బాగా కోపం వచ్చింది అనుకోండి... నాలుగు రోజులు మాట్లాడకుండా వుంటే సరి..కోపం దానంతట అదే తగ్గుతుంది..నిజం గా..ప్రయత్నించి చూడండి...!!!
(మళ్ళి నాలుగు రోజులకి తగ్గలేదంటారా...ఇంకో నాలుగు రోజులు మాట్లాడకండి...:)

చిన్న సలహా

అందరికి తెలిసినదే ఇది అయినా చెప్తున్నాను....రెడీ గా వున్నారా!!
కోపం వచ్చినప్పుడు ఒకటి నుండి పది వరకు అంకెలు లెక్కెట్ట్టుకోండోచ్.....!!

Wednesday 3 March 2010

ఆహ్వానం అందరికి

మీ సమస్య ఏదైనా ......తగిన సలహా కోసం....ఇప్పుడే....మీ సమస్యను నాతొ పంచుకోండి....మీ అందరికి ఇదే నా హృదయపూర్వక స్వాగతము....