మనలో చాలా మందికి అందరిలో కాని, ఎవరితోనైనా కాని మాట్లాడాలంటే ఎందుకో తెలియదు కాని అదోరకమైన భయం. మనం అనుకున్నది చెప్పలేక పోతాము. ఎదుటివాళ్ళు ఏమైనా అనుకుంటారేమో లేదా మనం చెప్పింది నచ్చక పొతే మనతోమాట్లాడటం మానేస్తారేమో....ఇలా ఎన్నో అనుమానాలతో భావ వ్యక్తీకరణ సరిగా చేయలేకపోతాము.
చెప్పాలనుకున్నది ఖచ్చితంగా..అనుకున్నది అనుకున్నట్లు ఎదుటివారిని నొప్పించకుండా చెప్పడం కుడా ఓ కళ. కొద్దిమందికి మాత్రమే ఈ కళని వరంగా దేవుడు ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఇక ఈ వరం లేని వారి సంగతి? ఏం చేద్దాం చెప్పండి మెల్లగా ఈ కళని అలవరుచుకోవడానికి ప్రయత్నించడమే. కొద్దిగానైనా తప్పకుండా వస్తుంది మన ప్రయత్నలోపం లేకుండా వుంటే. నీకు మంచి అనిపించింది మంచిమాటలలో చెప్పు. చెప్పాలనుకున్నది ఎదుటివారికి అర్ధమైయ్యేటట్లు చెప్పడం మన వంతు. నచ్చడం నచ్చక పోవడం వాళ్ళ ఇష్టం. ఏమనుకుంటారో అని చెప్పాలా వద్దా అని ఊగిసలాడితే ఎవరో మహానుభావులు అన్నట్లు ఓ జీవితకాలం లేటు అవ్వచ్చు. అందుకే ధైర్యం గా ఆలస్యం చేయకుండా మనసులో అనుకున్నది నిర్భయంగా , సూటిగా చెప్తే చాలా వరకు అనుమానాలు, అపార్ధాలు లేకుడా పోతాయి.
"మనసులో అనుకున్నది నిర్భయంగా , సూటిగా చెప్తే చాలా వరకు అనుమానాలు, అపార్ధాలు లేకుడా పోతాయి. "
ReplyDeleteఅని మీరు అన్నారు(వ్రాసారు).
కాని నాకు చిన్నప్పటి నుండి ఈ మనస్థత్వం ఉన్నది. అందువలన నాకు లభించిన విలువ ఏమిటో తెలుసా.........
హిట్లర్....
తింగరోడు....
వాడితో( అంటే నాతో) మాట్లాడం అంటే కొరివి తో తల గోక్కోవడం అని.....
అంటారు ( వ్యవహరిస్తున్నారు).
కాని వారికైదైనా అవసరం ఉంటే వెతుక్కుంటూ నాదగ్గర కు వస్తారు.
దీనికి మీరు నిర్భయంగా , సూటిగా సమాధానం చెప్పండి.
అది సహజం అండి అలానే అంటారు మనకు అనిపించినదానిని చెప్పడమే మంచిది.....
ReplyDeleteచాల బాగా చెప్పారు.
ReplyDeleteథాంక్యు శైలు ఓపికగా నా మాటలు చదివినందుకు + కామెంట్ రాసినందుకు.....
ReplyDeleteమీ మాటలింటే,చఛి పోయిన ఓపిక కూడా బ్రతికి వస్తుంది.అంత బావుంటాయ్,మీమాటలు.
ReplyDelete:) Thank u MAni kumar garu
ReplyDelete