మన దైనందిన జీవితం లో జరిగే ప్రతి చిన్న విషయానికి తగిన సలహాలు సంప్రదింపులతో కూడిన చిట్కాలు.....అందరికి అందుబాటులో....
Tuesday, 19 April 2011
ఆత్మద్రోహం
మన స్వార్ధం కోసం....మనకు అన్నం పెట్టి మనమీద నమ్మకాని పెట్టుకున్న వారిని వంచించడమంత ఆత్మద్రోహం మరొకటి లేదు.
Tuesday, 16 November 2010
చెప్పాలనుకున్నది....చెప్పేయ్ !!
మనలో చాలా మందికి అందరిలో కాని, ఎవరితోనైనా కాని మాట్లాడాలంటే ఎందుకో తెలియదు కాని అదోరకమైన భయం. మనం అనుకున్నది చెప్పలేక పోతాము. ఎదుటివాళ్ళు ఏమైనా అనుకుంటారేమో లేదా మనం చెప్పింది నచ్చక పొతే మనతోమాట్లాడటం మానేస్తారేమో....ఇలా ఎన్నో అనుమానాలతో భావ వ్యక్తీకరణ సరిగా చేయలేకపోతాము.
చెప్పాలనుకున్నది ఖచ్చితంగా..అనుకున్నది అనుకున్నట్లు ఎదుటివారిని నొప్పించకుండా చెప్పడం కుడా ఓ కళ. కొద్దిమందికి మాత్రమే ఈ కళని వరంగా దేవుడు ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఇక ఈ వరం లేని వారి సంగతి? ఏం చేద్దాం చెప్పండి మెల్లగా ఈ కళని అలవరుచుకోవడానికి ప్రయత్నించడమే. కొద్దిగానైనా తప్పకుండా వస్తుంది మన ప్రయత్నలోపం లేకుండా వుంటే. నీకు మంచి అనిపించింది మంచిమాటలలో చెప్పు. చెప్పాలనుకున్నది ఎదుటివారికి అర్ధమైయ్యేటట్లు చెప్పడం మన వంతు. నచ్చడం నచ్చక పోవడం వాళ్ళ ఇష్టం. ఏమనుకుంటారో అని చెప్పాలా వద్దా అని ఊగిసలాడితే ఎవరో మహానుభావులు అన్నట్లు ఓ జీవితకాలం లేటు అవ్వచ్చు. అందుకే ధైర్యం గా ఆలస్యం చేయకుండా మనసులో అనుకున్నది నిర్భయంగా , సూటిగా చెప్తే చాలా వరకు అనుమానాలు, అపార్ధాలు లేకుడా పోతాయి.

Sunday, 14 November 2010
తప్పొప్పులు
మనం చేసే తప్పులకు ఎదుటి వారిని బలి చేయకుండా, చేసిన తప్పుని ఒప్పుకునే మంచితనముంటే దానికి మించిన సంపద మరేది లేదు.
Thursday, 11 November 2010
Wednesday, 23 June 2010
చిన్న చిట్కా
ఏదైనా వేరే ఊరు కాని, కొత్త ప్రదేశానికి కాని వెళ్ళేటప్పుడు అక్కడి నీళ్ళు తేడా చేయకుండా ఉండటానికి (జలుబు లాంటివి తొందర గా రాకుండా ఉండటానికి) వెళ్ళే ముందు కుంకుడు కాయంత చిన్న పసుపు ముద్ద మింగి వెళితే జలుబు, జ్వరం లాంటివి మీ దరి చేరవు.
Friday, 18 June 2010
పెద్దలు చెప్పిన మాటలు....
మన ప్రవర్తన నలుగురికి ఆదర్శ ప్రాయంగా ఉండాలి కాని పదిమంది అసహ్యించుకునేలా ఉండకూడదు...
Wednesday, 9 June 2010
వినదగు మాటలు
తన వైఫల్యాలకు పరిస్థితులను నిందించకుండా వాటిని తనకనుకూలంగా మలుచుకోగలిగినవాడే విజయం సాదించగలుగుతాడు.
బెర్నాడ్ షా
బెర్నాడ్ షా
Subscribe to:
Posts (Atom)