Tuesday, 16 November 2010

చెప్పాలనుకున్నది....చెప్పేయ్ !!

మనలో చాలా మందికి అందరిలో కాని, ఎవరితోనైనా కాని మాట్లాడాలంటే ఎందుకో తెలియదు కాని అదోరకమైన భయం. మనం అనుకున్నది చెప్పలేక పోతాము. ఎదుటివాళ్ళు ఏమైనా అనుకుంటారేమో లేదా మనం చెప్పింది నచ్చక పొతే మనతోమాట్లాడటం మానేస్తారేమో....ఇలా ఎన్నో అనుమానాలతో భావ వ్యక్తీకరణ సరిగా చేయలేకపోతాము.
చెప్పాలనుకున్నది ఖచ్చితంగా..అనుకున్నది అనుకున్నట్లు ఎదుటివారిని నొప్పించకుండా చెప్పడం కుడా ఓ కళ. కొద్దిమందికి మాత్రమే ఈ కళని వరంగా దేవుడు ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఇక ఈ వరం లేని వారి సంగతి? ఏం చేద్దాం చెప్పండి మెల్లగా ఈ కళని అలవరుచుకోవడానికి ప్రయత్నించడమే. కొద్దిగానైనా తప్పకుండా వస్తుంది మన ప్రయత్నలోపం లేకుండా వుంటే. నీకు మంచి అనిపించింది మంచిమాటలలో చెప్పు. చెప్పాలనుకున్నది ఎదుటివారికి అర్ధమైయ్యేటట్లు చెప్పడం మన వంతు. నచ్చడం నచ్చక పోవడం వాళ్ళ ఇష్టం. ఏమనుకుంటారో అని చెప్పాలా వద్దా అని ఊగిసలాడితే ఎవరో మహానుభావులు అన్నట్లు ఓ జీవితకాలం లేటు అవ్వచ్చు. అందుకే ధైర్యం గా ఆలస్యం చేయకుండా మనసులో అనుకున్నది నిర్భయంగా , సూటిగా చెప్తే చాలా వరకు అనుమానాలు, అపార్ధాలు లేకుడా పోతాయి.

Sunday, 14 November 2010

తప్పొప్పులు

మనం చేసే తప్పులకు ఎదుటి వారిని బలి చేయకుండా, చేసిన తప్పుని ఒప్పుకునే మంచితనముంటే దానికి మించిన సంపద మరేది లేదు.

Thursday, 11 November 2010

చిన్న మాట

మనం చేసే ప్రతి పని ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా వుంటే అంత కన్నా మంచి పని ఇంకోటి లేదు.